బెజవాడ దుర్గమ్మ గుడికి త్వరలో రోప్ వే

530 మీటర్ల ఎత్తులో రోప్‌వే ఏర్పాటుచేయాలని తొలుత భావించడంతో ఇందుకు ఆయా మార్గంలో ఉన్న భవనాలు అడ్డు వచ్చాయి. దీంతో సీతమ్మవారి పాదాల వద్ద ఉన్న ఇరిగేషన్ కార్యాలయం నుంచి దుర్గగుడిపైకి వేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన డిజైన్లు, మ్యాప్‌లను పురావస్తు విభాగానికి పర్యటకశాఖ అధికారులు సమర్పించారు. ఈమేరకు త్వరలోనే ఆశాఖ అధికారులు దుర్గగుడికి వచ్చి పరిశీలించనున్నారు. వారు అనుమతి ఇవ్వగానే పనులు ప్రారంభిచడానికి పర్యటకశాఖ సిద్ధంగా ఉంది. పురావస్తుశాఖ అనుమతి ఇస్తే తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని దేవాదాయశాఖ అధికారులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యటకశాఖ అభివృద్ధిసంస్థ ఎం.డి. సందీప్‌కుమార్ సుల్తానియా దేవాదాయ, పురావస్తు శాఖల ఉన్నతాధికారులతో మాట్లాడారు. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రాజెక్టు పూర్తిచేయాలనే యోచనలో ఉన్నారు. దుర్గగుడి వద్ద రోజురోజుకీ ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. కొండపైకి వెళ్లి అమ్మను దర్శించుకునేందుకు భక్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక దసరా ఉత్సవాలు, పండుగల సమయాల్లో పరిస్థితి చెప్పే పనిలేదు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే రోప్‌వే ఒక్కటే మార్గమని భావిస్తున్నారు












Click it and Unblock the Notifications