హైదరాబాద్: తుపాను ముప్పు పొంచి ఉన్న తొమ్మిది కోస్తా జిల్లాలకు ప్రభుత్వం బుధవారం ప్రత్యేకాధికారులను నియమించింది. శ్రీకాకుళం జిల్లాకు అనిల్ కునేత, విజయనగరం జిల్లాకు బి. కిషోర్, విశాఖపట్నం జిల్లాకు జెఎస్పి ప్రసాద్, తూర్పు గోదావరి జిల్లాకు సుబ్రహ్మణ్యం, పశ్చిమ గోదావరి జిల్లాకు లవ్ అగర్వాల్, కృష్ణా జిల్లాకు విఆర్ మీనా, గుంటూరు జిల్లాకు హీరాలాల్, నెల్లూరు జిల్లాకు సాంబశివ రావు, ప్రకాశం జిల్లాకు కరికాల్ వలేకన్ లను నియమితులయ్యారు.
కాగా, తుపాను సహాయక చర్యల పర్యవేక్షణకు మంత్రులు జిల్లాలకు బయలుదేరారు. తుపాను ప్రాంతాల్లో సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి కె. రోశయ్య మంత్రులను ఆదేశించారు. దీంతో వారు వెంటనే జిల్లాలకు బయలుదేరి వెళ్లారు.