తుఫాను: 40 వేల మంది తరలింపు

అవసరమైనప్పుడు రంగంలోకి దిగడానికి సైన్యం ఎల్లవేళలా సిద్ధంగా ఉందని రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ చెప్పారు. నావికా దళంతో పాటు ఇతర సాయుధ బలగాలు కూడా సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలను తుఫాను ప్రభావం తాకింది. తుఫాను తీరం దాటే సమయంలో మరింతగా ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కె. రోశయ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు. తుఫాను ప్రభావిత జిల్లాల్లో నిత్యావసర సరుకులు అందుబాటులో పెట్టామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications