అప్రమత్తంగా ఉండండి: రోశయ్య

Rosaiah
హైదరాబాద్: తుఫాను ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె. రోశయ్య జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఆయన గురువారం ఉదయం జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన సూచించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో తీసుకుంటున్న సహాయక చర్యలపై ఆయన జిల్లా కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని ఆయన విజ్ఞప్తి చేశారు.

కాగా, ముఖ్మయంత్రి తన బెంగుళూర్, చెన్నై పర్యటనలను రద్దు చేసుకున్నారు. ఆయన శనివారం బెంగళూర్, చెన్నై పర్యటనలకు వెళ్లాల్సి ఉంది. లైలా తుఫాను నేపథ్యంలో ఆయన తన పర్యటనను రద్దు చేస్కున్నట్లు సిఎం కార్యాలయాధికారులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+