తెలగాణపై మాదే ఆఖరు కమిటీ: దుగ్గల్

కమిటీ ఎదుట ముఖ్యమంత్రి రోశయ్య, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హాజరవుతారా? అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు దుగ్గల్ సమాధానం దాటవేశారు. కాంగ్రెసు, టీడీపీ నుంచి మూడు ప్రాంతాల ప్రతినిధులు హాజరై తమ వాదనలు వినిపించారని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న వ్యక్తులు, సీనియర్ సిటిజన్లు, మేధావులు కూడా వాదనలు వినిపించవచ్చని, సామాజిక, ఆర్థిక, చట్టపరమైన అంశాలను కమిటీ దృష్టికి తీసుకురావొచ్చని చెప్పారు. వచ్చే వారం ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల ప్రతినిధులు, జూన్ 14న కాంగ్రెసు పార్టీ వాదనలు వినిపించనున్నారని దుగ్గల్ తెలిపారు. కమిటీ సభ్యులు విడివిడిగా, కలిసి జూలైలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నామని చెప్పారు. ఈ సమావేశంలో దుగ్గల్ తో పాటు సభ్యులు అబూసలే షరీఫ్, రణబీర్ సింగ్, రవీందర్ కౌర్, నోడల్ అధికారి రాజీవ్ శర్మ పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications