తుపానుకు 17 మంది మృతి

తుఫాను తాకిడి ప్రాంతాల్లో 71 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరిలంచినట్లు ఆయన తెలిపారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో పదేళ్ల రికార్డు స్థాయిలో అత్యధికంగా వర్షపాతం నమోదైందని ఆయన చెప్పారు. అద్దంకిలో 52 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఆయన తెలిపారు. మొత్తం 1,047 గ్రామాలు తుఫాను తాకిడికి గురైనట్లు ఆయన తెలిపారు. తుఫాను తాకిడి ప్రాంతాల్లో 85 ఇళ్లు పూర్తిగా, 187 ఇళ్లు పాక్షికంగా దెబ్బ తిన్నాయని ఆయన చెప్పారు.
తుఫాను తాకిడి ప్రాంతాల్లో 70 వేల ఫుడ్ ప్యాకెట్లను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ఐదు పశువులు, 2002 గొర్రెలు మరణించినట్లు ఆయన తెలిపారు. సమీక్షా సమావేశంలో ధర్మాన ప్రసాదరావుతో పాటు మంత్రులు గీతారెడ్డి, శత్రుచర్ల విజయరామ రాజు, గల్లా అరుణ, సునీత లక్ష్మారెడ్డి, కేంద్ర మంత్రి వనబాక లక్ష్మి, డిజిపి గిరీష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications