రోశయ్యకు ఇక మంచి మార్కులు: చిరు

Chiranjeevi
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనే పరిస్థితి నుంచి ఒక కొలిక్కి వచ్చి కదులుతున్నదని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రోశయ్య మంత్రుల్ని కట్టుదిట్టం చేసుకుని ప్రజాపథం నిర్వహించారని, ఫలితాలు ఎలా ఉన్నా ప్రభుత్వం ముందుకు పోతున్నదని అన్నారు. ఇలాంటి సమయంలో ప్రకృతి వైపరిత్యాలు కదలికకు కొంత ఆటంకం కలిగిస్తున్నాయని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేసంలో అన్నారు. ఇకనుంచి రోశయ్య మంచి మార్కులు సంపాదిస్తారని, మంత్రులు రోశయ్యకు సహకరిస్తారనే నమ్మకం తనకుందని ఆయన అన్నారు.

ఏ విధంగా విజయం సాధిస్తారనే ప్రశ్నపై స్పందిస్తూ తమ వ్యూహాలు తమకున్నాయని, అవి బాహాటంగా చెప్పేవి కావని చిరంజీవి అన్నారు. తన 15 రోజుల పోలవరం యాత్ర అనుకున్న ప్రకారం విజయవంతం అయిందని, ఆరు జిల్లాల్లో 1100 కిలోమీటర్లు పర్యటించానని వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో నిర్వాసితులను పరామర్శించి మెరుగైన పరిహారం ఇప్పించేందుకు కృషి చేయాలనుకున్నామని, తుఫాను వల్ల దాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నామని అన్నారు. ఈ నెల 26న తలపెట్టిన ఛలో పోలవరం సభనూ వాయిదా వేసుకున్నామని చెప్పారు. తిరిగి ఎప్పుడు నిర్వహించేది తర్వాత తెలుపుతామన్నారు. తమ యాత్ర వల్ల ప్రభుత్వంలో కదలిక వచ్చిందని, రెండో రోజే రాష్ట్ర ఎంపీలు ప్రధానిని కలిసి చర్చించారని పేర్కొన్నారు. అయితే వారు ఎంత బలంగా వాదించారనేదానిపైన తమకు అనుమానం ఉందన్నారు. తుఫాను వల్ల ఊహించిన దానికంటే ఎక్కువ నష్టం జరిగిందని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్పందన ఎలా ఉన్నా రాజకీయాలకు అతీతంగా సహాయ కార్యక్రమాలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+