నకిలీ సినీ నిర్మాత నవీద్అరెస్టు

అమ్మాయిల ఫొటోలు చూపించి సినిమా తీస్తానని పలువురికి చెప్పాడు. రామోజీ ఫిలింసిటీ, రామానాయుడు స్టూడియోకు తిరిగి తన మోసానికి మరింత బలం చేకూర్చాడు. ఇందులో భాగంగా ఈనెల 4న హైదరాబాద్ కు వచ్చి ఎమ్మెల్యే కాలనీలో అడ్వకేట్ చంద్రశేఖర్ ఇంటిని రూ. 50 వేల అద్దెతో తీసుకుని చెక్కులు ఇచ్చాడు. అదే విధంగా ఫర్నిచర్ కోసం ఎల్ జీ షోరూమ్ లో రూ. 3 లక్షల విలువ చేసే సామన్లు, ట్రినిటీ ట్రావెల్స్‌లో ఓ బెంజ్‌కారు అద్దెకు తీసుకుని రూ. 5 లక్షలకు అక్కడ కూడా చెక్కులు ఇచ్చి రూ. లక్ష అప్పు తీసుకున్నాడు.
ల్యాప్ టాప్ కొనుగోలకు కూడా చెక్కునే ఇచ్చాడు. కొద్ది రోజులకు బంజారాహిల్స్ రోడ్డు నెం.2లో అశోక్ అగర్వాల్ కు చెందిన కాంప్లెక్స్‌ని రూ. 22 కోట్లకు బేరం కుదుర్చుకుని, రూ. 18 కోట్లకు చెక్కులు ఇచ్చాడు. వీరందరికీ త్వరగా డబ్బులు వస్తాయంటూ బంజారాహిల్స్ బార్ క్లెస్ బ్యాంకులో అకౌంట్ లు ఇప్పించాడు. అయితే నవీద్ ఇచ్చిన చెక్కులన్నీ వారం రోజుల్లో బౌన్స్ అయ్యాయి. ఇల్లు ఇప్పించిన బ్రోకర్ కు కూడా రూ. 35వేల చెక్కును ఇవ్వగా అది కూడా బౌన్స్ అయ్యింది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బెంగళూరులో నిందితుడితో పాటు ఆయన భార్య, పని మనిషి, ఇద్దరు పిల్లలను బెంగుళూరులో ఎస్సై నాగేశ్వర్ రావు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద రూ. 1.70 లక్షల విలువ చేసే వస్తువులు, కొంత మంది అమ్మాయిల ఫొటోలు లభ్యమయ్యాయి. నవీద్ నుంచి ఆరు పాస్ పోర్టులతో పాటు ఒక మిలియన్ యుఎస్ డాలర్లకు సంబంధించిన సర్టిఫికెట్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సర్టిఫికెట్ తో చాలా మందిని మోసగించినట్లు పోలీసులు వెల్లడించారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications