వైయస్ పథకాలన్నీ మంచివే: గీతారెడ్డి

Geetha Reddy
హైదరాబాద్‌: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలన్నీ మంచివేనని, వాటిని తమ ప్రభుత్వం కొనసాగిస్తుందని మంత్రి జె. గీతారెడ్డి స్పష్టం చేశారు. వైయస్ పథకాల వల్లనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బ తిన్నదని కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆమె వ్యతిరేకించారు. ఆర్థిక మాంద్యానికి, వైయస్ ప్రవేశ పెట్టిన పథకాలకు ముడిపెట్టవద్దని ఆమె సూచించారు. వైయస్ ప్రవేశపెట్టిన పథకాల్లో దేన్నీ తొలగించబోమని, ముఖ్యమంత్రి కె. రోశయ్య అనుభవజ్ఞుడని, వైయస్ పథకాలను కొనసాగిస్తామని ముఖ్యమంత్రి రోశయ్య కూడా చెప్పారని ఆమె అన్నారు.

మంత్రులందరూ సమర్థవంతంగా పని చేస్తున్నారని ఆమె అన్నారు. రాష్ట్రంలో పలు సమస్యలు వచ్చాయని, వైయస్ ఆకస్మిక మరణం, కరవు, వరదలు, తెలంగాణ ఉద్యమం, మత ఘర్షణలు వంటి సమస్యలు వచ్చాయని, వీటి ప్రభావం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పడిందని ఆమె అన్నారు. రాష్ట్ర రెవెన్యూ తగ్గిన మాట వాస్తవమేనని, అయితే వైయస్ ప్రవేశపెట్టిన పథకాల అమలులో ప్రభుత్వం వెనక్కి తగ్గలేదని ఆమె అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదనే విషయాన్ని ముఖ్యమంత్రి కె. రోశయ్య ఎక్కడా దాచి పెట్టడం లేదని ఆమె అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+