సత్యంబాబు మిస్సింగ్ పై విచారణ: సబిత

కాగా, 2007 డిసెంబర్ 27వ తేదీన అయేషా మీరా హాస్టల్లో హత్యకు గురైంది. ఈ కేసులో మాజీ మంత్రి కోనేరు రంగారావు మనవడు సతీష్ పై ప్రధానమైన ఆరోపణ వచ్చింది. పోలీసులు తొలుత వంట మనిషి హత్యకు కారణమని చెప్పారు. ఆ తర్వాత అయేషా హత్య కేసులో నిందితుడిగా లడ్డూను అరెస్టు చేశారు. చివరగా 2008 మార్చిలో సత్యంబాబును అరెస్టు చేసి మీడియా ముందు హాజరు పరిచారు. అయేషా హత్యకు తానే పాల్పడ్డానని సత్యంబాబు మీడియా ముందు చెప్పాడు. కానీ, ఆ తర్వాత తనను పోలీసులు కేసులో ఇరికించారని ప్రతిసారీ అరిచి చెబుతూనే ఉన్నాడు.
సత్యంబాబుకు 2008 ఆఖరులో నరాల వ్యాధి సోకింది. పోలీసులు చిత్రహింసలు పెట్టడం వల్లనే అతని ఆ వ్యాధి వచ్చినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. సత్యంబాబు తరఫు న్యాయవాదుల చొరవతో అతని హైదరాబాదులోని నిమ్స్ లో చికిత్స చేయించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. అప్పటి నుంచి నిమ్స్ లో అతనికి చికిత్స చేయిస్తున్నారు. పోలీసుల సహాయంతో తప్ప నడవలేని స్థితిలో సత్యంబాబు ఉన్నాడు. తనంత తానుగా బాత్రూమ్ కు కూడా వెళ్లలేని దుస్థితి అతనిది.












Click it and Unblock the Notifications