తిరుపతి: టిటిడి చరిత్రలో ఒక చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. తిరుమలలో శ్రీవెంకటేశ్వర స్వామివారికి భక్తులు సమర్పించే బంగారాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బిఐ)లో భద్రపరిచే విధంగా టిటిడి ఒప్పందం చేసుకుంది. దశలవారీగా మొత్తం 3 వేల కిలోల బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. తొలివిడత వేయి కిలోల బంగారాన్ని డిపాజిట్ చేస్తారు. ఈ ఒప్పంద కార్యక్రమానికి ఎస్‌బిఐ చైర్మన్ ఓపి భట్, టిటిడి చైర్మన్ డి.కె.ఆదికేశవులు నాయుడు, ఇఓ ఐ.వై.రామకృష్ణారావు హాజరైయ్యారు.