వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ కు రోశయ్య వార్నింగ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
న్యూఢిల్లీ: సంక్షేమ పథకాల అమలుపై తమ పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ చేస్తున్న విమర్శలను ముఖ్యమంత్రి కె. రోశయ్య సీరియస్ గా తీసుకున్నారు. సోమవారం సాయంత్రం ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిసిన తర్వాత ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఎవరైనా పార్టీ గీసిన గీతకు లోబడే ఉండాలని, దాన్ని దాటితే పార్టీలో చోటుండదని ఆయన అన్నారు. వైయస్ జగన్ తనకు తన అబ్బాయిలాంటివాడని, వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడిగా జగన్ పై తనకు అభిమానం ఉందని ఆయన అన్నారు.

అదే సమయంలో తనకు, జగన్ కు మధ్య ఎలాంటి అగాధం లేదని ఆయన అన్నారు. తనది 79 ఏళ్లు పూర్తి చేసుకునే వయస్సని, ఆ వయస్సులో చేసే ఆలోచనలూ నడవగలిగే శక్తీ ఒక రకంగా ఉంటుందని, 40 ఏళ్ల వయస్సు లోబడిన వారి శక్తి వేరే రకంగా ఉంటుందని, వారు ఎంత దూరమైనా పరుగులు పెట్టగలరు, ఎత్తైన గోడలనైనా దూకగలరని, అలాంటప్పుడు తమ మధ్య పోటీ ఎలా ఉంటుందని ఆయన అన్నారు. మిమ్మల్ని జగన్ దాటేయడానికి ప్రయత్నిస్తున్నారా అని అడిగితే మీరు లేని పోనివి సృష్టించవద్దని, అలాంటి పరిస్థితి లేదని, తాను క్రమశిక్షణ గల కాంగ్రెసు కార్యకర్తనని, తాను నాయకత్వం గీసిన గీతను దాటే వాడిని కానని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X