తెలుగుదేశం పార్టీ వారసత్వం: బాలయ్యా, లోకేషా?

చంద్రబాబు నుంచి పార్టీని తమ చేతుల్లోకి తీసుకోవడానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పునరేకీకరణకు ప్రయత్నాలు చేస్తున్నారని ఇటీవల ప్రచారం జరిగింది. బాలయ్య మాటలను బట్టి కూడా ఆయన పార్టీని తన చేతుల్లోకి తీసుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నట్లు అర్థమవుతోంది. దీంతో చంద్రబాబు వేగంగా కదలాల్సిన అవసరం ఏర్పడింది. బాలయ్య దూకుడుకు అడ్డు కట్ట వేసేందుకు లోకేష్ ను చంద్రబాబు ముందుకు తెస్తున్నట్లు తెలుస్తోంది.
లోకేష్ స్వయంగా అల్లుడు కావడం బాలయ్య ముందరి కాళ్లకు బంధం వేసేది. చంద్రబాబు చాలా ముందు చూపుతోనే తన కుమారుడు లోకేష్ కు బాలకృష్ణ కూతురు బ్రాహ్మణిని ఇచ్చి వివాహం చేసినట్లు మొదటి నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. ఆ ప్రచారానికి ప్రస్తుత పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి. తనకు వ్యతిరేకంగా బాలకృష్ణ పని చేయడానికి వెనకాడకపోవచ్చు గానీ స్వయానా అల్లుడు అయిన లోకేష్ ను కాదనడానికి వెనకాడవచ్చుననేది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. అవసరమైతే లోకేష్ ను ముందు పెట్టి బాలయ్య చేతుల్లోకి పార్టీ నాయకత్వం వెళ్లకుండా చూడాలనేది ఆయన ఉద్దేశంగా కనిపిస్తోందని అంటున్నారు.












Click it and Unblock the Notifications