జగన్ జబర్దస్తీ ఏమిటి?: కెసిఆర్

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణలో పర్యటించవద్దని అందరూ అంటుంటే పర్యటించి తీరుతానని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు పట్టుబట్టడంలోని జబర్దస్తీ ఏమిటని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ప్రశ్నించారు. జగన్ తెలంగాణలో పర్యటిస్తే మళ్లీ డిసెంబర్ నాటి పరిస్థితులు పునరావృతమవుతాయని ఆయన హెచ్చరించారు. తెలంగాణ జెఎసి కన్వీనర్ కోదండరామ్ తో కలిసి ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఎవరి సహనానికైనా హద్దు ఉంటుందని, ఒక వేళ జగన్ అదే పద్ధతని అనుకుంటే చూసుకుందామంటే చూసుకుందామని ఆయన అన్నారు.

జగన్ వరంగల్ పర్యటనను ఆపాలని, వరంగల్ జిల్లాలో యుద్ధ వాతావరణాన్ని నివారించాలని, రక్తపాతాన్ని సృష్టించవద్దని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆవేశాన్ని రగిలించి రెచ్చగొడితే అది వరంగల్ జిల్లాకు మాత్రమే పరిమితం కాదని, అనుభవజ్ఞుడైన రోశయ్య ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, జగన్ పర్యటనను ఆపాలని ఆయన అన్నారు. జగన్ ఇచ్చేది ఒక్కో కుటుంబానికి ఇచ్చేది లక్ష రూపాయలైతే భద్రతా ఏర్పాట్లకు పోలీసు ఖర్చు 12 కోట్ల రూపాయలవుతుందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు, ప్రజాప్రతినిధులు వద్దంటున్నా జగన్ పర్యటిస్తానని అనడం జబర్దస్తీయేనని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+