వైయస్ జగన్ తెలంగాణ యాత్రను అడ్డుకుంటారా?: రాఘవులు

BV Raghavulu
హైదరాబాద్: తెలంగాణలో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పర్యటనను అడ్డుకుంటామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు అనడం సరి కాదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు అన్నారు. పర్యటనను అడ్డుకోవడం జగన్ ప్రజాస్వామ్య హక్కును కాలరాయడమేనని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా పర్యటించవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎదుటివారి హక్కులను కాపాడితేనే మన హక్కులకు రక్షణ ఉంటుందని ఆయన అన్నారు. పథకాల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాకీలు విడుదల చేయకపోతే తాము ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+