ఢిల్లీలో తెలుగు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు: చంద్రబాబు

ప్రాంతీయ పార్టీగా ఉంటూనే తమ పార్టీ జాతీయ స్థాయిలో ప్రధాన పాత్ర పోషించిందని, జాతీయ స్థాయిలో కాంగ్రెసేతర ప్రభుత్వాల ఏర్పాటులో తమ పార్టీ చురుకైన పాత్ర నిర్వహించిందని ఆయన అన్నారు. జాతీయ స్థాయిలో కూడా తమ పార్టీ ప్రతిపక్ష పాత్ర నిర్వహించిందని ఆయన చెప్పారు.
తాము ఎప్పుడు అధికారంలో ఉన్నా ప్రజా సమస్యలను పరిష్కరించామని ఆయన అన్నారు. సంక్షేమ పథకాలకు తమ పార్టీయే శ్రీకారం చుట్టిందని ఆయన చెప్పారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన అన్నారు. ధరల పెరుగుదలకు ప్రభుత్వ విధానాలే కారణమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications