వైయస్ జగన్ పై హైకమాండ్ చర్య తీసుకుంటుందా?

అయితే జగన్ దిగిరాకపోతే కాంగ్రెసు పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుందా అనేది చర్చనీయంగా మారింది. జగన్ పై చర్యలు తీసుకోవడం కాంగ్రెసు అధిష్టానానికి అంత సులభం కాలేదని అంటున్నారు. జగన్ తన యాత్రను విరమించుకోవాలని పార్టీ అధిష్టానం ఎక్కడా జగన్ కు అధికారికంగా సూచించలేదు. జగన్ యాత్రపై పార్టీ అధిష్టానం ఏ విధమైన సంకేతాలు రాలేదని సాక్షి దినపత్రిక ఓ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. జగన్ యాత్రకు ఆటంకాలు లేవని మొయిలీ చెప్పకనే చెప్పారని సాక్షి టీవీ చానెల్ లో ఓ వార్తాకథనం ప్రసారమైంది.












Click it and Unblock the Notifications