వంగపల్లిలో రైల్వే స్టేషన్ వద్ద వైయస్ జగన్ అరెస్టు

ఓదార్పు యాత్రను విరమించుకోవాలని కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు నచ్చజెప్తున్నామని, మాట వినకపోతే బలవంతంగా అరెస్టు చేస్తామని అంతకు ముందు రాష్ట్ర డిజిపి గిరీష్ కుమార్ చెప్పారు. జగన్ యాత్రకు తమ అనుమతి లేదని చెప్పారు. వరంగల్ జిల్లా పరిస్థితుల దృష్ట్యా ముఖ్యమంత్రి కె.రోశయ్య నెల్లూరు హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. ఆయన నెల్లూరు నుంచి ఫోనులో డిజిపి గిరీష్ కుమార్ తో మాట్లాడారు. హైదరాబాదులోని తన నివాసానికి రావాల్సిందిగా ఆయన డిజిపికి సూచించారు. యాత్రను విరమించుకోవాలని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు మంత్రులు, శాసనసభ్యులు జగన్ కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసుల ద్వారా జగన్ ను ప్రభుత్వం అరెస్టు చేయించింది.












Click it and Unblock the Notifications