మా బావ చంద్రబాబు కోసం కష్టపడ్తా: బాలకృష్ణ

Balakrishna
హైదరాబాద్‌ : తన బావ చంద్రబాబు కోసం, పార్టీ కోసం కష్టపడతానని ప్రముఖ సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు బాలకృష్ణ అన్నారు. ఆయన శనివారం తెలుగుదేశం పార్టీ మహానాడు సభలో మాట్లాడారు. తనకు పదవులు ముఖ్యం కాదని, పార్టీని అధికారంలోకి తేవడమే ముఖ్యమని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చునని, పార్టీ శ్రేణులు సంసిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. పార్టీని ఈసారి తప్పకుండా అధికారంలోకి తేవాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయకత్వంలో పార్టీని అధికారంలోకి తేవడం తన ఉద్దేశమని ఆయన అన్నారు. కాంగ్రెసుకు రోజులు దగ్గర పడ్డాయని ఆయన అన్నారు.

2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీదే అధికారమని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రజల వద్దకు పాలన వంటి కార్యక్రమాల ద్వారా, ఐటిని ప్రోత్సహించడం ద్వారా రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేశారని ఆయన కొనియాడారు. కాంగ్రెసు దుష్టపాలన సాగిస్తోందని, అన్యాయాలకు అంతు లేకుండా పోయిందని, తమ పార్టీ కార్యకర్తలపై, నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెసు ప్రభుత్వం పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+