ఆటో ప్రమాదంలో ఇద్దరు మహిళల మృతి

జిల్లాలో నిన్న జరిగిన రెండు సంఘటనల్లో ఇద్దరు మరణించారు. ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్ ఐ కృష్ణయ్య కథనం ప్రకారం.. మహేశ్వరం నివాసి జోర్ల మల్లేష్ పాల వ్యాపారి. శుక్రవారం రాత్రి కందుకూరు మండలం కొత్తూరు నుంచి స్వగ్రామానికి మోటార్ సైకిల్ పై వస్తుండగా హైదరాబాద్ నుంచి శ్రీశైలం వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో మల్లేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. శనివారం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ట్రాక్టర్ పై నుంచి ఓ బాలుడు పడి మృతి చెందాడు. గండేడ్ మండలం నంచర్లలో 'ఉపాధి' పనుల్లో కూలీలు చెరువులో ఒండ్రుమట్టిని పొలాలకు తరలిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన బాల్ రెడ్డి శనివారం ట్రాక్టర్ ఒండ్రుమట్టిని తీసుకొని పొలాలకు వెళుతుండగా మార్గమధ్యంలో ఆనంద్ (14) ఎక్కాడు. అది కదలడంతో ఆ బాలుడు దాని కింద పడి నలిగి పోయాడు. బాలుని పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. తమ కొడుకు మృతికి తట్టుకోలేక తండ్రి చంద్రయ్య, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications