హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పెద్ద షాపూర్ రవాణాశాఖ చెక్ పోస్టుపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. వాహనాదారుల నుంచి అక్రమంగా డబ్బు వసూలు చేస్తున్న రవి, సిద్దు, నర్సింహ్మ అనే ముగ్గురు దళారులను అధికారులు అరెస్టు చేశారు. వీరినుంచి రూ. 46 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
రవాణాశాఖలో అవినీతి తీవ్ర స్ధాయిలో ఉందన్న విషయం విజిలెన్స్ విభాగం దృష్టికి వచ్చింది. రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో కీలక పాత్ర వహిస్తున్న ఒక జాతి పిత పేరుతో ఉన్న ఒక అధికారిపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.