హైదరాబాద్: ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్ష ప్రారంభమైంది. 604 కేంద్రాలలో 3 లక్షల 28 వేల 689 విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. నగరంలో ఈ పరీక్ష కోసం ఆర్టీసీ వారు ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు తీసుకువచ్చారు.
పరీక్ష కేంద్రాలకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించలేదు. రాజేంద్ర నగర్ మహాత్మా గాంధీ కాలేజీలో ఆలస్యంగా వచ్చిన అశ్వని అనే విద్యార్థినిని అధికారులు అనుమతించలేదు.