విశాఖపట్నం: అగనంపూడి మండలం కొండవలసలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు జరుగుతున్న సమయంలో నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఒక సివిల్ ఇంజనీర్ కి తీవ్రగాయాలయ్యాయి. అతనిని ఆస్పత్రికి తరలించారు. జివిఎంసి ఆధ్వర్యంలో పనులు జరుగుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. శిధిలాల నుంచి మృత దేహాలను వెలికి తీయడానికి అగ్నిమాపక శాఖ సిబ్బంది, పోలీసులు ప్రయత్నిస్తున్నారు.