హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవి ప్రజారాజ్యం కాంగ్రెసుకు తోక అవుతుందా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇచ్చిన అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటారనే దానిపై ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. పెద్ద అంచనాలతో రాజకీయాల్లోకి ప్రవేశించిన చిరంజీవి ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూశారు. కేవలం 18 మందిని మాత్రమే శాసనసభకు గెలిపించుకుని ప్రభుత్వ ఏర్పాటులో ఏ విధమైన పాత్రను కూడా పోషించలేకపోయారు. ఎన్నికల్లో ఓటమి, పార్టీ భవిష్యత్తుపై అనిశ్చితి వల్ల ప్రజారాజ్యం పార్టీ నుంచి ఒక్కరొక్కరే వెళ్లిపోతున్నారు. పైకి చిరంజీవి గంభీరంగా మాట్లాడుతున్నప్పటికీ లోపల పార్టీ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారనే భావించవచ్చు. ఈ స్థితిలో చిరంజీవికి సోనియా నుంచి ఓ అవకాశం అంది వచ్చింది. కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ధిక్కార ధోరణి కూడా సోనియా చిరంజీవికి తగిన అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకుని ఉంటారు.

తమ పార్టీని కాంగ్రెసులో విలీనం చేయబోమని చిరంజీవి చెబుతున్నారు. అయితే, విలీనం అంశం కూడా ఆయన ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీని విలీనం చేస్తే సముద్రం లాంటి కాంగ్రెసులో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంటుందని, దాని వల్ల అధికారం అందుతుందో అందదో చెప్పలేమని సన్నిహితులు చిరంజీవికి చెబుతున్నట్లు తెలుస్తోంది. మిత్ర పక్షంగా ఉంటూ తగిన సీట్లు సంపాదించుకుని ఒత్తిడి రాజకీయాల ద్వారా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనే ఆలోచన చిరంజీవి ఎజెండాలో ప్రధానాంశమై ఉండవచ్చు. అయితే, కాంగ్రెసుతో పొత్తుల వల్ల, స్నేహం వల్ల ప్రజారాజ్యం పార్టీ ఎదిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాంగ్రెసుకు ఎల్లకాలం తోక పార్టీగా మాత్రమే మిగిలిపోవాల్సి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెసులో విలీనం చేస్తే చిరంజీవి ఒక వెలుగు వెలగడానికి అవకాశం ఉంటుందని, సోనియా గాంధీ ఒక్కసారి హామీ ఇస్తే దాన్ని అమలు చేస్తారని, అందువల్ల కాంగ్రెసులో పార్టీని విలీనం చేసి ఆ పార్టీని అధికారాన్ని తిరిగి సొంత చేసుకోవడానికి ఇమేజ్ ద్వారా, కాంగ్రెసు క్యాడర్ ద్వారా ప్రయత్నిస్తేనే చిరంజీవి తొందరగా అధికార యోగం పడుతుందనే వాదన కూడా వినిపిస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X