అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరుతో పొత్తు జగన్ కు చెక్ పెట్టడానికి కాదు: జెసి దివాకర్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

JC Diwakar Reddy
అనంతపురం: తమ పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు చెక్ పెట్టడానికి ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవితో చేతులు కలుపుతున్నారనే ప్రచారంలో నిజం లేదని కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి అన్నారు. ఒకరికి చెక్ పెట్టడానికో, మరొకరిని అందలమెక్కించడానికో కాంగ్రెసు ఏ పనీ చేయాల్సిన అవసరం లేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. వ్యక్తులను బట్టి కాంగ్రెసు ఏ పనీ చేయదని ఆయన అన్నారు. కాంగ్రెసులోకి చాలా మంది వస్తుంటారని, అందులో భాగమే చిరంజీవిని కలుపుకుని పోవడమని ఆయన అన్నారు. చిరంజీవితో సోనియా భేటీకి ప్రాధాన్యం లేదని ఆయన అన్నారు.

వైయస్ జగన్ పై చర్య తీసుకోవాలనే కాంగ్రెసు తెలంగాణ నేతల డిమాండ్ తో తాను ఏకీభవించబోనని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెసులో వాక్ స్వాతంత్ర్యం ఉందని, ఆ వాక్ స్వాతంత్ర్యంతోనే వారు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిని ఇంద్రుడు, దేవేంద్రుడు అన్న తెలంగాణ నాయకులే ఇప్పుడు ఛీత్కరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఓదార్పు యాత్రను కొనసాగించాలా, వద్దా అనేది జగన్ ఇష్టమని ఆయన అన్నారు. చిరంజీవిని మంత్రివర్గంలో చేర్చుకునే విషయంపై తుది నిర్ణయం ముఖ్యమంత్రి రోశయ్య, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీలదే తుది నిర్ణయమని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బలోపేతం చేయడానికే చిరంజీవితో చేతులు కలుపుతున్నట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X