తెలంగాణ ద్రోహి చిరంజీవితో స్నేహం వద్దు: జీవన్ రెడ్డి

తెలంగాణ వ్యతిరేకి అయిన చిరంజీవితో కాంగ్రెసు పొత్తు వల్ల తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బ తింటాయని, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆయన అన్నారు. కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ చేసిన ప్రకటనను బట్టి చిరంజీవి కాంగ్రెసుకు చేరువ కావడం సమైక్యవాదుల కుట్ర అనే విషయం తెలిసిపోతోందని ఆయన అన్నారు. తెలంగాణకు అనుకూలంగా ఉన్న పార్టీలతోనే కాంగ్రెసు పార్టీ స్నేహం చేయాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications