కాల్పులు రవిశంకర్ ను హత్య చేయడానికి కాదు: డిజిపి

ఇదిలావుండగా, పండిట్ రవిశంకర్ సోమవారం యధావిధిగా తన సత్సంగ్ కు చేరుకున్నారు. యథావిధిగా సత్సంగ్ నిర్వహించారు. తాను క్షేమంగా ఉన్నట్టు, భక్తులెవ్వరూ ఆందోళన చెందవద్దని ఆయన విజ్ఝప్తి చేశారు తనకు శత్రువులెవ్వరూ లేరని, ఉగ్రవాదాన్ని విస్తరించే వారే తనపై దాడికి పాల్పడ్డారని ఆయన చెప్పారు. కాల్పులు జరిపిన వ్యక్తి తప్పించుకుని వెళ్లడానికి వీల్లేకుండా ఆ కేంద్రం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఈ సందర్భంగా బిజెపి ప్రెసిడెంట్ నితిన్ గాడ్కరి కర్నాటక ముఖ్యమంత్రి బి. యస్ యడుయూరప్పకు రవిశంకర్ పై కాల్సుల వివరాలు తెలియజేస్తూ భద్రతా ఏర్పాట్టు మరికొంత కట్టుదిట్టం చేయాలని మరికొంతమంది సెక్యూరిటిని ఇవ్వవలసిందిగా లెటర్ ద్వారా తెలియజేశారు.












Click it and Unblock the Notifications