రోశయ్య మంత్రివర్గంలో చిరంజీవి చేరుతారా?

JC Diwakar Reddy
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ముఖ్యమంత్రి రోశయ్య మంత్రివర్గంలో చేరుతారా అనే చర్చ జరుగుతోంది. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో చిరంజీవి చర్చలు జరిపిన నేపథ్యంలో ఈ చర్చకు పునాది పడింది. కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి చేసిన ప్రకటన అందుకు బలం చేకూరుస్తోంది. కాంగ్రెసు ప్రభుత్వాన్ని బలోపేతం చేయడానికే చిరంజీవిని కలుపుకుని పోతున్నామని జెసి దివాకర్ రెడ్డి సోమవారం అనంతపురంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. చిరంజీవిని మంత్రివర్గంలో చేర్చుకునే విషయంపై తుది నిర్ణయం ముఖ్యమంత్రి రోశయ్య, తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీలదే తుది నిర్ణయమని ఆయన అన్నారు. దీన్ని బట్టి ప్రజారాజ్యం పార్టీ మంత్రివర్గంలో చేరే విషయంపై కూడా సోనియా చిరంజీవితో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది.

అయితే, చిరంజీవి ముఖ్యమంత్రి పదవిని కాకుండా మంత్రి పదవిని చేపట్టడానికి ఇష్టపడతారా అనేది సందేహమే. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసుకు విజయాన్ని చేకూర్చి పెట్టడం ద్వారా ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు మాత్రమే చిరంజీవి ఇష్టపడవచ్చుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజారాజ్యం పార్టీ మాత్రం ప్రభుత్వంలో చేరే అవకాశాలున్నాయని భావించవచ్చు. తన శాసనసభ్యులను కాపాడుకోవడానికి వారికి మంత్రి పదవులను చిరంజీవి అడగవచ్చు. ఒక వేళ కాంగ్రెసు నుంచి జగన్ బయటకు వస్తే తన శాసనసభ్యులు ఆయన వైపు వెళ్లకుండా నిరోధించడానికి తన పార్టీ శాసనసభ్యులకు మంత్రి పదవులు ఇవ్వాలని చిరంజీవి కోరవచ్చు. కాంగ్రెసు కూడా బహుశా అదే దిశలో ఆలోచించే అవకాశం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+