ఆత్మరక్షణలో జగన్: చేతులెత్తేసిన కెవిపి రామచందర్ రావు

YS Jagan
హైదరాబాద్: వరంగల్ జిల్లా ఓదార్పు యాత్ర నేపథ్యంలో కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆత్మరక్షణలో పడ్డారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సీరియస్ కావడం, కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ హెచ్చరించడం పరిస్థితి తీవ్రతను పట్టించింది. దీంతో జగన్ ను కాపాడడానికి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రియ మిత్రుడు కెవిపి రామచందర్ రావు వెంటనే ఢిల్లీ వెళ్లి కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీని కలిశారు. దీంతో ఫలితం కనిపించలేదు. ఆదివారం హైదరాబాద్ తిరిగి వచ్చి వైయస్ జగన్ కు పరిస్థితి తీవ్రతను వివరించినట్లు తెలుస్తోంది. దీంతో వైయస్ జగన్ ఆదివారంనాడు ఢిల్లీ వెళ్లారు. తన పర్యటనపై, దాని పరిణామాలపై జగన్ అధిష్టానం పెద్దలకు వివరించే ప్రయత్నం చేస్తారని అంటున్నారు.

జగన్ వ్యవహారంపై పార్టీ అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. తమ సూచనలను బేఖాతరు చేస్తూ వరంగల్ జిల్లా ఓదార్పు యాత్రకు బయలుదేరడాన్ని సహించకూడదనే ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం. పైగా, ఓదార్పు యాత్ర పరిణామాలపై ముఖ్యమంత్రి రోశయ్యను కాదని, గవర్నర్ నరసింహన్ ను జగన్ కలవడాన్ని కూడా అధిష్టానం సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం. సొంత ప్రభుత్వాన్ని జగన్ నిందించేందుకు పూనుకున్నారని భావిస్తున్నట్లు చెబుతున్నారు. జగన్ పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు, నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+