కాంగ్రెసుతో పొత్తు చిరంజీవికి ఆత్మహత్యా సదృశ్యం: నారాయణ

కాంగ్రెసు కుమ్ములాటలు రాష్ట్రాభివృద్ధికి ఆటంకంగా మారాయని నారాయణ ఆరోపించారు. సామాన్యులు బాధలను మంత్రులు పట్టించకోవడం లేదని ఆయన విమర్శించారు. మంత్రివర్గం, ప్రభుత్వ యంత్రాంగం పనిచేయకపోవడం వల్ల కింది స్థాయి ప్రభుత్వ సిబ్బంది కూడా పనిచేయడం లేదని ఆయన అన్నారు. జులై నుంచి ప్రత్యక్ష భూపోరాటాలకు దిగుతామని ఆయన చెప్పారు. తన ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రాభివృద్ధి జరిగిందనే తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మాటలను ఆయన వ్యతిరేకించారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తాము ఆందోళనలు చేశామని, చంద్రబాబు హయాంలో అభివృద్ధి జరిగి ఉంటే తాము ఆందోళనలు చేసి ఉండేవారం కాదని, ఈ విషయంపై చర్చ జరుగుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications