హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ తో కాంగ్రెసు అధిష్టానం ఫుట్ బాల్ ఆడుతోంది: నారాయణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Narayana
హైదరాబాద్: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తో ఆ పార్టీ అధిష్టానం ఫుట్ బాల్ ఆడుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ వ్యాఖ్యానించారు. రాష్ట్ర మంత్రివర్గంతో జగన్ ఫుట్ బాల్ ఆడుకుంటున్నారని ఆయన బుధవారం మీడియాతో అన్నారు. కాంగ్రెసు కుమ్ములాటలతో ప్రభుత్వ కార్యకలాపాలు ముందుకు సాగడం లేదని ఆయన అన్నారు.

కాంగ్రెసు పార్టతో పొత్తు పెట్టుకోవడం ప్రజారాజ్యం పార్టీకి ఆత్మహత్యా సదృశ్యమే అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. పొత్తు కాంగ్రెసు, ప్రజారాజ్యం రెండు పార్టీలకు కూడా నష్టమేనని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును అదుపు చేసే దమ్ము ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రభుత్వానికి లేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X