వైయస్ జగన్ పై హైకమాండ్ కు నివేదిక ఇవ్వలేదు: మొయిలీ

Veerappa Moily
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్ర వ్యవహారంపై తాను ఇంకా పార్టీ అధిష్టానానికి నివేదిక ఇవ్వలేదని కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ చెప్పారు. వీరప్ప మొయిలీ ఇచ్చే నివేదిక ఆధారంగా జగన్ పై చర్యలు తీసుకుంటామని ఇటీవల ఎఐసిసి అధికార ప్రతినిధి జయంతీ నటరాజ్ చేసిన ప్రకటనపై ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆ విధంగా అన్నారు.

పార్టీ అంతర్గత వ్యవహారాలను తాము సరిదిద్దుకోగలమని ఆయన అన్నారు. వైయస్ జగన్ ఓదార్పు యాత్రకు అనుమతి లేదని ఆయన మరోసారి చెప్పారు. జగన్ ఓదార్పు యాత్రకు తాను అనుమతి ఇచ్చినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని కూడా ఆయన అన్నారు. జగన్ ఓదార్పు యాత్రపై పార్టీ వైఖరి మారలేదని ఆయన చెప్పారు. తాను మంగళవారం చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+