ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణ రంగులు!

Radha Krishna
ఆంధ్రజ్యోతి, ఎబిఎన్ చానల్ యజమాని వేమూరి రాధాకృష్ణ నిజస్వరూపాన్ని నేడు సూర్య పత్రిక, నిన్న ఎన్టీవీ చానల్ బయటపెట్టాయి. నిజామాబాద్ జిల్లా నుంచి మహారాష్ట్రకు కిరోసిన్ స్మగుల్ చేసి ఆ డబ్బుతో చదువుకున్నానని ఈ రాధాకృష్ణ తన ఆత్మకథలో రాసుకున్నారు. అది ఆయన పత్రికలో ప్రచురితమైంది. చిరంజీవి కంటే గొప్ప హీరోగా ప్రజల మనసుల్లో ఉండాలని రాధాకృష్ణ అలా చేసి ఉండవచ్చు. స్వరూపానందని మొదట బ్లాక్ మెయిల్ చేసింది రాధాకృష్ణేనని ఎన్టీవీ కథనాలు చెబుతున్నాయి. ఈమధ్య కాలంలో ఇంతగా భ్రష్టు పట్టిన పత్రికా యజమాని ఎవరూ లేరు.

రాధాకృష్ణపై సూర్య పత్రిక ప్రచురించిన కథనంలోని ఒక పేరాను చదవండి. "సైకిల్‌ చైన్‌ తెగితే ఆ గ్రీజును తుడుచుకోవడానికి తన ఛాంబరుకు వచ్చే వాడని స్వయంగా ముఖ్యమంత్రి రోశయ్యనే స్పష్టం చేశారు. అలాంటి రాధాకృష్ణ ఒక్కసారిగా తాను పనిచేసిన పత్రికకు ఎలా యజమాని అయ్యాడు? అందుకు ఆయన వద్ద ఉన్న ఆర్థిక వనరులు ఏమిటి? ఏడాది పొడవునా నీళ్లు ఉండే హైడల్‌ పవర్‌ ప్లాంట్‌కు యజమాని ఎలా అయ్యాడు? సొంత కొడుకు గుండెకు చిన్నతనంలో రంధ్రం పడితే నిమ్స్‌ జనరల్‌ వార్డులో చికిత్స చేయించిన ఈ ఆదర్శ మూర్తికి ఇప్పుడు డజన్ల కార్లు ఎక్కడివి? ఒక్క రాత్రిలో రిక్షాలు, ఆటోలు, బియ్యపు బస్తాలు, రక్తదానం చేసి కోట్లు సంపాదించడానికి ఆయనేమైనా తెలుగు సినిమాలో హీరోనా?..ఇలాంటి ప్రశ్నలకు 'దిగ్రేట్‌ బ్లాక్‌ మెయిల్‌" జర్నలిస్టు శ్రీమాన్‌ వేమూరి రాధాకృష్ణ ఎందుకు సమాధా నాలు ఇవ్వలేదో ప్రపంచానికి వెల్లడించవలసి ఉంది. అంటే ఇతరులకే తప్ప తనకు 'ఆత్మశోధన" పనికిరాదని అర్ధం చేసుకోవాలా?- ఇదీ సూర్య కథనంలోని ఒక భాగం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+