రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై తలపట్టుకున్న చంద్రబాబు

Chandrababu Naidu
హైదరాబాద్: రాష్ట్రం నుంచి జరుగుతున్న రాజ్యసభ ఎన్నికలకు రెండో అభ్యర్థిని ఎంపిక చేయడంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తలపట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరు రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశం ఉంది. రాజ్యసభ సీటు ఆశిస్తున్నవారి సంఖ్య తెలుగుదేశం పార్టీలో చాలా ఎక్కువగా ఉంది. దీనితో చంద్రబాబుకు అభ్యర్థుల ఎంపిక అంత సులభం కావడం లేదు. సుజనా చౌదరిని ఇప్పటికే ఒక అభ్యర్థిగా చంద్రబాబు ఎంపిక చేశారు. మరో అభ్యర్థిని ఎంపిక చేయాల్సింది.

రెండో అభ్యర్థిని ఎంపిక చేయడానికి చంద్రబాబు ఎడతెరిపి లేని చర్చలు సాగిస్తున్నారు. ఈ అభ్యర్థిని తెలంగాణ నుంచి ఎంపిక చేయాలని ఆయన భావిస్తున్నారు. అది కూడా అభ్యర్థి బిసి అయి ఉండాలి. దీంతో ఆయనకు సమస్యలు వచ్చి పడుతున్నాయి. సుజనా చౌదరి ఎంపికపైనే పార్టీలో తీవ్రంగా కలతలు చెలరేగాయి. చౌదరికి టికెట్ ఇవ్వడానికి రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ కూడా వ్యతిరేకించారు. అయినా చంద్రబాబు పట్టించుకోలేదు. రెండో అభ్యర్థి ఎంపికపై ఆయన కసరత్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+