టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు తెలుగు తమ్ముళ్ల అలక

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ లేని విధంగా తెలుగు తమ్ముళ్ల నుంచి వ్యతిరేకతను, నిరసనను ఎదుర్కుంటున్నారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై బుధవారం సాయంత్రం జరిగిన పార్టీ పోలిట్ బ్యూరో సమావేశంలో పార్టీ నాయకులు పలువురు చంద్రబాబు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ అసంతృప్తిని వారు బహిరంగంగానే వ్యక్తం చేశారు. రాజ్యసభకు సీమాంధ్ర నుంచి సుజనా చౌదరిని ఎంపిక చేయడంపై తెలుగుదేశం నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సుజనా చౌదరి కొత్తగా పార్టీలోకి వచ్చారని, పైగా పార్టీ కోసం చేసిందేమీ లేదని వారు విమర్శించారు. అయితే తెర వెనక సహాయం అందించినవారిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి కదా అని చంద్రబాబు వారికి సర్దిచెప్పడానికి ప్రయత్నించారు.

సుజనా చౌదరి ఎంపికపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ అవసరమైతే తాను పార్టీకి రాజీనామా చేస్తానని యనమల రామకృష్ణుడు అన్నారు. అలాగే, పార్టీ నాయకులు కంభంపాటి రామ్మోహన్ రావుకు, నాగం జనార్దన్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగింది. అభ్యర్థుల సూచనపై వారిరువురికి మధ్య వాగ్వివాదం చెలరేగింది. కాగా, శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు అలక వహించి పోలిట్ బ్యూరో సమావేశం నుంచి అర్థాంతరంగా వెళ్లిపోయారు. ధనవంతులకు రాజ్యసభ టికెట్లు ఇవ్వకూడదని హరికృష్ణ ప్రకటన చేసి వివాదానికి తెర తీశారు. అదే అభిప్రాయం తెలుగు తమ్ముళ్ల నుంచి చంద్రబాబు వద్ద వ్యక్తమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+