హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాదులో పాస్ పార్టో హ్కాకింగ్ స్కామ్: నలుగురు అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Passport slots Hacking Scam
హైదరాబాద్‌: హైదరాబాద్ ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయం అధికారిక వెబ్ సైట్ హ్యాకింగ్ కుంభకోణంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు నలుగురు సభ్యులతో కూడిన ముఠాను అరెస్టు చేశారు. వీరిలో పాస్ పార్టు కార్యాలయం ఉద్యోగి రత్నాకర్ తో పాటు నలుగురు ఉన్నారు. పాస్ పోర్టు ఆన్ లైన్ వెబ్ సైట్ ను హ్యాక్ చేసి స్లాట్స్ బ్లాక్ చేసి వీరు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసుకున్న బ్రోకర్లకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వచ్చాయి.

కాగా, పాస్ పోర్టు వెబ్ సైట్ హ్యాకింగ్ లో కీలకపాత్ర పోషించిన ఓ అధికారిని రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రాంతీయ పాస్ పోర్టు అధికారి గా బాల భాస్కర్ బదిలీ తర్వాత మళ్ళీ ఏజెంట్లకు ద్వారాలు తెరుచుకున్నాయి. దరఖాస్తులు పెరగాయన్న కారణంతో 90 మందికి పైగా ఏజెంట్లకు లైసెన్స్‌లు ఇచ్చారు. వారి ద్వారా దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందని చెప్పారు. అయితే దరఖాస్తుల సమర్పణ గడువు తేదీ ఆన్‌లైన్‌లో ఆలస్యంగా వస్తోంది. ఇది ఏజెంట్లకు అసౌకర్యం కలిగిస్తోంది. ఈ క్రమంలో తమకు నచ్చిన తేదీని ఎంపిక చేసుకునే దిశగా పాస్‌పోర్టు వెబ్‌సైట్‌నే హ్యాకింగ్‌ చేసినట్టు తెలుస్తోంది. అధికారిక కార్యాలయం వ్యక్తిగత సమాచారం దొంగిలించి, వాటి ద్వారా తేదీలను ఇష్టానుసారం వచ్చేలా చేశారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారికి అతి సన్నితంగా ఉండే ఓ మహిళా ఉద్యోగిపై సిబ్బందిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో ఆమె సాదా సీదా పోస్టులో ఉండేది. ఇప్పుడు ఆమే మొత్తం చక్రం తిప్పడం సందేహాలకు తావిస్తోంది. కొత్తగా ఏర్పాటు చేసిన ఏజెంట్ల వ్యవస్థలోనూ ఆమె జోక్యం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. దాదాపు పది మంది ఏజెంట్లను ఆమె సిఫారసు ప్రకారమే తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఏజెంట్ల ద్వారా వచ్చే పాస్‌పోర్టులను ఆమె దగ్గరుండి చూసుకుంటోందని కార్యాలయంలో పలువురు ఉద్యోగులు అనుకుంటున్నారు. ప్రధాన కార్యాలయంలోనే పనిచేసే మరో పౌర సంబంధాల అధికారి వ్యవహారంపై కూడా కార్యాలయ వర్గాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఏజెంట్లను తప్ప సామాన్యులను పట్టించుకోని ఆ వ్యక్తిపై దరఖాస్తుదారులు అనేక సందర్భంల్లో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరూ ఏజెంట్లకు రెడ్‌ కార్పెట్‌ పరుస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే హ్యాకింగ్‌ జరిగిందా అనే అనుమానాలు ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X