రేణుకా చౌదరి, డిఎస్ లకు నిరాశ: సింఘీకి మొండిచెయ్యి

కాగా, రాజ్యసభలో అడుగు పెట్టడానికి తీవ్రంగా ప్రయత్నించిన కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరికి నిరాశే ఎదురైంది. ఖమ్మం పార్లమెంటు నియోజక వర్గం నుంచి ఓడిపోయిన తర్వాత ఆమె తిరిగి పార్లమెంటులో కాలు పెట్టడానికి రాజ్యసభ సీటు కోసం తీవ్రంగానే ప్రయత్నించారు. ఆమె పేరును అధిష్టానం పరిగణనలోకి తీసుకున్నప్పటికీ పార్టీ అవసరాల దృష్ట్యా పాత వారికే టికెట్లు ఇవ్వాల్సి వచ్చింది. అదే విధంగా ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కూడా రాజ్యసభ సీటు కోసం ప్రయత్నాలు చేశారు. రేణుకా చౌదరికి, డిఎస్ కు రాజ్యసభ సీట్ల విషయంలో నిరాశే ఎదురైంది.












Click it and Unblock the Notifications