కెవిపి రామచందర్ రావుతో భేటీ: వైయస్ జగన్ ఎడతెగని ప్రయత్నాలు

ముఖ్యమంత్రి రోశయ్యకు, జగన్ కు మధ్య సయోధ్య కుదర్చడానికి మధ్యవర్తిత్వం వహిస్తున్న రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ శుక్రవారం జగన్ ను కలిశారు. ప్రస్తుతానికి ఏదో మేరకు రాజీ పడడమే మంచిదని ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ కు చెబుతున్నట్లు సమాచారం. ఇదే సమయంలో శ్రీకాకుళం జిల్లా ప్రజలు జగన్ కోసం ఎదురు చూస్తున్నారంటూ ఆయన టీవీ చానెల్ సాక్షిలో వార్తాకథనం ప్రసారమవుతోంది. శ్రీకాకుళం ప్రజలతో జగన్ రాక కోసం ఎదురు చూస్తున్నామంటూ కొంద మంది వ్యక్తులు చెప్పిన విషయాలను సాక్షి టీవీలో ప్రసారం చేస్తున్నారు. దీన్ని బట్టి శ్రీకాకుళం జిల్లా ఓదార్పు యాత్రకు జగన్ పార్టీ అధిష్ఠానం అనుమతి సాధించాలనే పట్టుదలతో ఉన్నట్లు అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications