ముంబై: ముంబై పేలుళ్లలో సజీవంగా పట్టుబడిన ఏకైక ప్రధాన నిందితుడు అజ్మల్ అమీర్ కసబ్ తనకు ప్రత్యేక కోర్టు విధించిన మరణ శిక్షను హైకోర్టులో సవాల్ చేయనున్నాడు. ఆయనకు మే 6వ తేదిన మరణశిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. హైకోర్టులో తన తరపున వాదించేందుకు న్యాయవాది కావాలంటూ ఆర్థర్ రోడ్డు జైలు అధికారుల ద్వారా ముంబై హైకోర్టు ఫ్రీ లీగల్ ఎయిడ్ ప్యానెల్ కు కసబ్ లేఖ రాశాడు. లాయర్ ను కోరుతూ, దరఖాస్తుతో పాటు కోర్టు కేసు తీర్పుకు సంబంధించిన 1500 పేజీలతో కూడిన పత్రాలను హైకోర్టుకు పంపారు. వీటిని కోర్టు లీగల్ సర్వీసెస్ కమిటి చైర్మన్ కు పంపనుంది.