పార్టీ చూసుకుంటుంది: జయసుధ వ్యవహారంపై కార్తిక రెడ్డి
Districts
oi-Pratapreddy
By Pratap
హైదరాబాద్: రాజీనామా చేస్తానని సికింద్రాబాద్ శాసనసభ్యురాలు జయసుధ వ్యవహారాన్ని పార్టీ చూసుకుంటుందని హైదరాబాద్ మేయర్ బండ కార్తిక రెడ్డి అన్నారు. ఆమె శుక్రవారం ముఖ్యమంత్రి కె. రోశయ్యను, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ను కలిసి వివరణ ఇచ్చారు.
వార్డు కమిటీ సభ్యుల ఎంపికలో తన భర్త చంద్రారెడ్డి ప్రమేయం లేదని ఆమె స్పష్టం చేశారు. పెళ్లి రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలపడానికి తాను ముఖ్యమంత్రిని కలిసినట్లు ఆమె తెలిపారు.