రోశయ్యతో వైయస్ జగన్ రాజీకి ఉండవల్లి మధ్యవర్తిత్వం

Undavalli Arun Kumar
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. రోశయ్యతో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు రాజీ కుదర్చడానికి రాజమండ్రి కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ రంగంలోకి దిగారు. ఆయన గురువారం సాయంత్రం ముఖ్యమంత్రిని కలిశారు. తాను మధ్యవర్తిగా వ్యవహరించడం లేదని, తాను అంత పెద్ద వాడ్ని కాదని ఉండవల్లి ముఖ్యమంత్రితో భేటీ అనంతరం మీడియా ప్రతినిధులతో అన్నారు. అయితే, రోశయ్యతో జగన్ కు రాజీ చేయడానికి ఆయన చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఉండవల్లి ముఖ్యమంత్రిని కలిసినట్లు విశ్వసనీయ సమాచారం. ఉండవల్లి అరుణ్ కుమార్ దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడు. జగన్ మేలు కోరి ఆయన రంగంలోకి దిగినట్లు చెబుతున్నట్లు చెబుతున్నారు.

ఈ నెల 8వ తేదీ నుంచి శ్రీకాకుళం జిల్లాలో జగన్ తలపెట్టిన ఓదార్పు యాత్రకు కూడా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఓదార్పు యాత్రకు అనుమతి లేదని అధిష్టానం చెప్పిన నేపథ్యంలో జగన్ కు సహకరించడానికి కాంగ్రెసు శాసనసభ్యులు, నాయకులు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఓదార్పు యాత్రను రద్దు చేసుకుంటే మంచిదని శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొండ్రు మురళి జగన్ తో చెప్పినట్లు తెలుస్తోంది. కొండ్రు మురళి జగన్ కు సన్నిహితుడు. అధిష్టానం అనుమతి లేకుండా ఓదార్పు యాత్రకు సహకరించడం కష్టమని ఆయన జగన్ తో అన్నట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో ముఖ్యమంత్రితో రాజీ కుదర్చేందుకు జగన్ తరఫున ఉండవల్లి రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+