పోతే పొమ్మన్న హైకమాండ్: అడకత్తెరలో వైయస్ జగన్

ముఖ్యమంత్రి రోశయ్యకు పూర్తి సహకరించాలని, అది ఇష్టం లేకపోతే తన దారి తాను చూసుకోవాలని వైయస్ జగన్ కు అధిష్టానం సూచించినట్లు చెబుతున్నారు. అధిష్టానం మాటపై జగన్ తన అనుచరులుతో చర్చించినట్లు చెబుతున్నారు. అయితే చాలా మంది పార్టీ అధిష్టానంపై తిరుగుబాటు చేసేందుకు సిద్ధంగా లేనట్లు చెబుతున్నారు. రాజకీయాల్లో కొన్ని సాహసాలు కూడదని, తిరుగుబాటులో విఫలమైతే తమ గతేమిటని వారు జగన్ తో అన్నట్లు తెలిసింది. తన వ్యూహం అమలులో విఫలమైతే వ్యాపారాలు చేసుకుంటారు, తాము రాజకీయాలనే నమ్ముకున్నవాళ్లం, వ్యూహం ఎదురు తిరిగితే రాజకీయంగా భవిష్యత్తు శూన్యమవుతుందని అని ఓ నాయకుడు అన్నారు. దీంతో జగన్ రాజీబాటు పట్టినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications