హైదరాబాద్: తాను శాసనసభ్యురాలిని కాబట్టి తనకు హైదరాబాద్ మేయర్ కార్తిక రెడ్డి మర్యాద ఇవ్వాలని జయసుధ అన్నారు. కార్తిక రెడ్డి దంపతులపై ముఖ్యమంత్రి కె. రోశయ్యతో భేటీ తర్వాత ఆమె శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఎమ్మెల్యే ముఖ్యమని, అందువల్ల తనకు మర్యాద ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని ఆమె అన్నారు. కార్తిక రెడ్డి దంపతులు తన పట్ల వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రికి చెప్పానని, పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని ఆమె చెప్పారు.
తనది భావోద్వేగ మనస్తత్వమని, తనది సున్నితమైన మనస్సు అని ముఖ్యమంత్రికి తెలుసునని ఆమె అన్నారు. తాను రాజకీయాల్లో కొత్త అని, ఎలా పరిష్కరిస్తారో చూడాల్సిన అవసరమని ఆమె అన్నారు.