హైదరాబాద్: హైదరాబాద్ మేయర్ కార్తిక రెడ్డితో చెలరేగిన వివాదంలో కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు పి. శంకర రావు సికింద్రాబాద్ శాసనసభ్యురాలు జయసుధకు మద్దతుగా నిలిచారు. మేయర్ కార్తిక రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు. శాసనసభ్యులను మేయర్ కార్తిక రెడ్డి అగౌరవపరుస్తున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కార్తిక రెడ్డి వ్యవహారాన్ని తాను ముఖ్యమంత్రి కె. రోశయ్య దృష్టికి తీసికెళ్లినట్లు ఆయన తెలిపారు.
పార్టీ కార్యకర్తలను గుర్తించకపోతే భవిష్యత్తులో జెండా మోసేవారుండరని ఆయన వ్యాఖ్యానించారు. వార్డు కమిటీ ఎన్నికల్లో మేయర్ కార్యకర్తలకు అన్యాయం చేశారని ఆయన విమర్శించారు.