అసెంబ్లీ ఉప ఎన్నికలు: వేడెక్కుతున్న తెలంగాణ

Telangana
హైదరాబాద్: ఉప ఎన్నికలు సమీపిస్తుండడంతో తెలంగాణలో పరిస్థితి వేడెక్కుతోంది. తెలంగాణలోని 12 శాసనసభా స్థానాలకు ఆగస్టు 30వ తేదీ లోగా ఉప ఎన్నికలు జరగనున్నాయి. శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలను వ్యతిరేకిస్తూ 12 మంది శాసనసభ్యులు రాజీనామాలు చేయడంతో ఉప ఎన్నికలు అనివార్యంగా మారాయి. రాజీనామా చేసినవారిని ఈ స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని తెలంగాణ ప్రజా సంఘాల నుంచి డిమాండ్ వస్తోంది. తెలంగాణకు చెందిన కొందరు కాంగ్రెసు నాయకులు కూడా ఏకగ్రీవ ఎన్నికనే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోటీకి దిగాలని కాంగ్రెసు అధిష్టానం నిర్ణయించింది. దీంతో తెలంగాణ ఉప ఎన్నికలను ఎదుర్కోవాల్సిన గడ్డు స్థితిలో తెలంగాణ కాంగ్రెసు నాయకులు పడ్డారు. కాంగ్రెసు నిర్ణయంతో తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నికలకు దిగే అవకాశం ఉంది.

ఉప ఎన్నికల్లో పోటీ అనివార్యం కావడంతో తెలంగాణ రాజకీయ వేడి ప్రారంభమైంది. కాంగ్రెసు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, రాజీనామా చేసిన అభ్యర్థులకు మద్దతుగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి) నాయకులు చైతన్యయాత్ర చేపట్టారు. వీరి బస్సు యాత్ర ఉప ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో సాగుతుంది. కాంగ్రెసు నిర్ణయాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఎంగిలి మెతుకులకు డిఎస్ ఆశపడుతున్నారని వారు వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికలు సమీపించే కొద్దీ తెలంగాణలో వాతావరణం మరింత వేడెక్కే ప్రమాదం ఉంది. ఉప ఎన్నికలు జరిగే 12 స్థానాల్లో పరిస్థితిని అదుపు చేయడం ప్రభుత్వానికి సమస్యగానే మారవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+