ప్రపంచ బ్యాంక్ నిధులతో ఆయకట్టు ఆధునీకరణ: సిఎం

Rosaiah
బాపట్ల: కృష్ణా డెల్టా, నాగార్జున సాగర్‌ ఆధునికీకరణతో రెతులకు ఎంతో మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు. గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా బాపట్ల వ్యవసాయకళాశాలలో ఏర్పాటుచేసిన రైతుసదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రూ.4,500 కోట్లతో కృష్ణాడెల్టా ఆధునికీకరణ పనులు చేపట్టనున్నట్లు రోశయ్య వెల్లడించారు. రూ.2,500 కోట్ల ప్రపంచ బ్యాంకు రుణంతో సాగర్‌ అధునికీకరణ పనులు చేపట్టనున్నట్లు చెప్పారు.

రైతులకు సరఫరా చేసేందుకు విత్తనాలు సిద్దంగా ఉంచినట్లు వెల్లడించారు. రుణాల కోసం రైతులకు ఇబ్బందిలేకుండా ఈ ఏడాది జిల్లాలో రెండువేల కోట్లు మంజూరుచేసినట్లు ఆయన తెలిపారు. కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, రాష్ట్రమంత్రులు రఘువీరారెడ్డి, పిల్లి సుబాష్‌చంద్రబోస్‌, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+