వెనక్కి తగ్గిన వైయస్ జగన్ : ఓదార్పు యాత్ర వాయిదా

ఇప్పట్లో జగన్ ను కలుసుకోవడానికి సోనియా ఇష్టంగా లేరని అహ్మద్ పటేల్ విజయలక్ష్మితో చెప్పారు. ఓదార్పు యాత్రను నిరవధికంగా వాయిదా వేసుకోవడం మంచిదని, ఆ ఊసెత్తక్కపోతేనే మంచిదని ఆయన చెప్పారు. ఈ స్థితిలో కుటుంబ సభ్యులంతా కలిసి చర్చించుకున్నారు. కుటుంబ సభ్యుల సలహా, ఒత్తిడి మేరకు జగన్ తన యాత్రను వాయిదా వేసుకున్నారు. ఆ తర్వాత బాధితులకు ఓ లేఖ రాసి మీడియాకు విడుదల చేశారు. ఓదార్పు యాత్రను వాయిదా వేసుకుంటున్నందుకు తనను మన్నించాలని ఆయన ప్రజలను కోరారు.












Click it and Unblock the Notifications