హైదరాబాద్: టీవీ ఆర్టిస్టు డింపుల్‌పై రంగారెడ్డి జిల్లాలోని మణికొండలో బుధవారం దాడి జరిగింది. ఓ మహిళ డింపుల్ కళ్లలో కారం కొట్టి, ఇనుపరాడ్‌తో దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన ఆమెను అపోలో ఆసుపత్రికి తరలించారు. వ్యక్తిగత కారణాలవల్లే డింపుల్‌పై దాడి జరిగనట్లు సమాచారం.
టీవీ ఆర్టిస్టు శ్రీధర్ వర్మపై హైదరాబాద్ సమీపంలోని కూకట్ పల్లి సమీపంలో మంగళవారం దాడి జరిగింది. దీనిపై శ్రీధర్ వర్మ కూకట్ పల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.