చిరంజీవితో కాంగ్రెసు పొత్తుపై నాగం జనార్దన్ రెడ్డి నిప్పులు

తెలంగాణలోని 12 శాసనసభా స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పోటీ చేయకపోతే తాము కూడా చేయబోమని, పోటీ చేయకుండా కాంగ్రెసును కెసిఆర్ ఒప్పించాలని ఆయన అన్నారు. తెరాస శాసనసభ్యులతో కెసిఆర్ ఏకపక్షంగా రాజీనామాలు చేయించారని ఆయన వ్యాఖ్యానించారు. కెసిఆర్ స్వార్థ కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణవాదాన్ని వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణకు ఎల్లవేళలా అన్యాయం చేస్తున్న కాంగ్రెసు పార్టీని వదిలేసి తమపై కెసిఆర్ విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications