విశాఖపట్నంలో పాస్ పోర్టు సేవా కేంద్రం

Vishakapatnam
విశాఖపట్నం: విశాఖ, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల పాస్ పోర్టు కష్టాలు దాదాపు తీరినట్టే. నెలల తరబడి పాస్‌ పోర్టు కోసం వేచి చూడడం, విచారణ కోసం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరగడం, బ్రోకర్లను ఆశ్రయించే అవసరం ఇక లేనట్టే. విశాఖకు కొత్తగా ఓ పాస్‌పోర్టు సేవా కేంద్రం (పీఎస్‌కే) మంజూరైనట్టు ఇక్కడి అధికారులు మంగళవారం తెలిపారు.

టాటా సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభించే ఈ కేంద్రానికి ఇప్పటికే స్థలం కోసం చూస్తున్నారు. ముఖ్య కూడలిలో నగర వాసులకు అనువుగా ఉండే ప్రాంతంలో ఈ సేవా కేంద్రం ఏర్పాటు చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. హైదరాబాద్‌, తిరుపతి, వరంగల్‌, విశాఖ కేంద్రాల్లో ఆరు పాస్‌ పోర్టు సేవా కేంద్రాలు ప్రారంభించనున్నట్టు హోంమంత్రి సబితారెడ్డి సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇక్కడి అధికారులకు ఆదేశాలందాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+